🏠 www.cm9news.in
Watermark
Clip Header Logo
Date of Publish : 15 October 2026, 6:53 pm Posted by : CM9NEWS

నివాస ప్రాంతంలో అక్రమ గోల్డ్ రిఫైనరీ .

News Image
CM9NEWS : పట్టణంలోని కన్యకా పరమేశ్వరి వీధిలో గోల్డ్ రిఫైనరీ నిర్వహణపై వివాదం నెలకొంది. తన ఇంటి పక్కనే సందీప్ అనే వ్యక్తి ఇంటి మూడో అంతస్తులో బంగారం శుద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని శ్రీనివాసులు ఆరోపించారు.
ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ పరిశ్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆర్డీవోకు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
రసాయనాల వల్ల తనకు, తన భార్యకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతంలో ఇలాంటి పరిశ్రమల నిర్వహణపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
🏠 Home