🏠 www.cm9news.in
Watermark
Clip Header Logo
Date of Publish : 23 October 2026, 7:41 pm Posted by : CM9NEWS

కావలిలో ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ నామినేషన్లు.

News Image
CM9NEWS: నెల్లూరు జిల్లా,కావలి నియోజకవర్గంలో మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఉన్న 47 ఎంపీటీసీ సెగ్మెంట్లకు మొత్తం 234 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.పార్టీల వారీగా పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ నుంచి 117 మంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 92 మంది, జనసేన పార్టీ నుంచి 14 మంది, భారతీయ జనతా పార్టీ నుంచి ఆరుగురు, బీసీవై పార్టీ నుంచి ఇద్దరు, బీఎస్పీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు.
మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నామినేషన్ల కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షిస్తూ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.
మొత్తంగా కావలి నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
🏠 Home