పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం
CM9NEWS : కావలి నియోజకవర్గంలో రేపు జరగనున్న పరిషత్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొత్తం 47 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉండగా, వీటిలో ఆరు సెగ్మెంట్లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 41 ఎంపీటీసీ స్థానాలతో పాటు నాలుగు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 1,34,051 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం నాలుగు మండలాల పరిధిలో 190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల నిర్వహణకు వెయ్యి మందికి పైగా సిబ్బందిని నియమించారు.
సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియను సీసీ కెమెరాలు, వీడియో గ్రఫీ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని అధికారులు సిబ్బందికి పంపిణీ చేశారు. అనంతరం సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.