నివాస ప్రాంతంలో అక్రమ గోల్డ్ రిఫైనరీ!
CM9NEWS: కావలి: పట్టణంలోని కన్యకా పరమేశ్వరి వీధిలో నివాస ప్రాంతంలో అనుమతులు లేకుండా గోల్డ్ రిఫైనరీ నిర్వహిస్తున్నారని స్థానికుడు పోలిశెట్టి సురేష్ బాబు ఆరోపించారు. ఈ పరిశ్రమ నుంచి వెలువడుతున్న రసాయనాల వల్ల స్థానికుల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ తన ఇంటి పక్కనే నివసిస్తున్న సందీప్ అనే వ్యక్తి ఇంటి మూడో అంతస్తులో భారీ యంత్రాలను ఏర్పాటు చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు, అవసరమైన లైసెన్సులు లేకుండానే గోల్డ్ రిఫైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. బంగారాన్ని కరిగించడం,...