జలదంకిలో వైసీపీకి గట్టి షాక్!

CM9NEWS: జలదంకి: నెల్లూరు జిల్లా జలదంకి మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న సీనియర్ నేత, జలదంకి మండల మాజీ కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన పాలవల్లి మాలకొండారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జలదంకి మండల కన్వీనర్‌గా పనిచేశారు. మండల రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, అనుచరగణాన్ని...