దగదర్తి ఎంపీపీ అభ్యర్థిగా మాలేపాటి భవాని నామినేషన్ దాఖలు.

ముఖ్యమైన పాయింట్స్:దగదర్తి ఎంపీపీ అభ్యర్థిగా మాలేపాటి భవాని నామినేషన్ దాఖలు.. CM9NEWS : దగదర్తి: నెల్లూరు జిల్లా దగదర్తి మండల టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు సతీమణి మాలేపాటి భవాని బరిలో నిలిచారు. మండలంలోని బిట్‌-1 నుంచి ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి ఆమె అట్టహాసంగా నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాలేపాటి భవాని మాట్లాడుతూ.. ఎంపీపీ అభ్యర్థిగా తనను, అలాగే తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేశ్‌,వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద...