ఆమదాలదిన్నెలో ఉప్పాల కిరణ్కు ప్రజల బ్రహ్మరథం!
CM9NEWS: కావలి సంస్థల ఎన్నికల ప్రచారంలో కావలి మండలం ఆమదాలదిన్నె ఎంపీటీసీ అభ్యర్థి ఉప్పాల కిరణ్ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఆమదాలదిన్నె గ్రామంలో ఆయన నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామంలో అడుగడుగునా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఉప్పాల కిరణ్ మాట్లాడుతూ.. మీ తమ్ముడిగా, మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వచ్చానని, తనను ఆశీర్వదించి ప్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే జెడ్పీటీసీ అభ్యర్థిని కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు...