Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నివాస ప్రాంతంలో అక్రమ గోల్డ్ రిఫైనరీ!

Author
Posted By CM9NEWS
| 15 Oct 2026, 06:40 PM | ఆంధ్రప్రదేశ్, నెల్లూరు
నివాస ప్రాంతంలో అక్రమ గోల్డ్ రిఫైనరీ!

CM9NEWS: కావలి: పట్టణంలోని కన్యకా పరమేశ్వరి వీధిలో నివాస ప్రాంతంలో అనుమతులు లేకుండా గోల్డ్ రిఫైనరీ నిర్వహిస్తున్నారని స్థానికుడు పోలిశెట్టి సురేష్ బాబు ఆరోపించారు. ఈ పరిశ్రమ నుంచి వెలువడుతున్న రసాయనాల వల్ల స్థానికుల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ తన ఇంటి పక్కనే నివసిస్తున్న సందీప్ అనే వ్యక్తి ఇంటి మూడో అంతస్తులో భారీ యంత్రాలను ఏర్పాటు చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు, అవసరమైన లైసెన్సులు లేకుండానే గోల్డ్ రిఫైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. బంగారాన్ని కరిగించడం, విదేశీ ముద్రలతో బంగారు బిస్కెట్ల తయారీ వంటి పనులు చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రక్రియలో ఉపయోగిస్తున్న రసాయనాల ప్రభావం నివాస ప్రాంతంలోకి వ్యాపిస్తోందని పేర్కొన్నారు.ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయగా, అధికారులు పరిశీలించి పరిశ్రమను ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించాలని నోటీసులు జారీ చేసినట్లు శ్రీనివాసులు తెలిపారు. అయినప్పటికీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. అనంతరం ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా, ఆయన కూడా పరిశీలించి రసాయనాల వినియోగంపై ప్రశ్నించడంతో పాటు, నివాస ప్రాంతంలో ఇలాంటి పరిశ్రమలు నిర్వహించకూడదని హెచ్చరించినట్లు వెల్లడించారు. మున్సిపల్ అధికారులు సైతం ఈ పరిశ్రమకు ఎలాంటి లైసెన్సులు మంజూరు చేయలేదని స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.గోల్డ్ రిఫైనరీ నుంచి వెలువడుతున్న రసాయనాల వల్ల తన ఆరోగ్యం దెబ్బతిని గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు వాంతులు, విరేచనాలు కావడంతో రామచంద్రారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు తెలిపారు. ఈ అనారోగ్య సమస్యలకు రసాయనాలే కారణమని వైద్యులు నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు.

నివాస ప్రాంతంలో ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తూ పరిశ్రమ నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదుపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పరిశ్రమకు సంబంధించిన అనుమతులు, రసాయనాల వినియోగం, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: